Header Banner

తెలంగాణలో ముగ్గురు ఐపీఎస్‌లకు హోం శాఖ షాక్! 24 గంటల్లో ఏపీలో రిపోర్ట్ ...

  Sat Feb 22, 2025 09:28        India

అంజనీ కుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మహంతి. ఈ ముగ్గురిని వెంటనే రిలీవ్‌ చేయాలని హోం శాఖ ఆదేశాలిచ్చింది. డీజీ అంజనీ కుమార్‌ ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు. ఆయన తెలంగాణ డీజీపీగా కూడా గతంలో పనిచేశారు. అభిషేక్‌ మహంతి ప్రస్తుతం కరీంనగర్ సీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అభిలాష బిస్త్త్ తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

తెలంగాణలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ముగ్గురు ఐపీఎస్‌లకు కేంద్ర హోం శాఖ షాకిచ్చింది. ప్రస్తుతం ఉన్న పోస్టుల నుంచి రిలీవ్‌ చేస్తూ.. 24 గంటల్లోగా ఏపీలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ ముగ్గురు ఐపీఎస్‌లు ఎవరంటే.. అంజనీ కుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మహంతి. ఈ ముగ్గురిని వెంటనే రిలీవ్‌ చేయాలని హోం శాఖ ఆదేశాలిచ్చింది. డీజీ అంజనీ కుమార్‌ ఏపీ క్యాడర్ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు. ఆయన తెలంగాణ డీజీపీగా కూడా గతంలో పనిచేశారు. అభిషేక్‌ మహంతి ప్రస్తుతం కరీంనగర్ సీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అభిలాష బిస్త్త్ తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. అంజనీ కుమార్‌, అభిలాష బిస్త్‌ డీజీ ర్యాంక్‌లో ఉండగా, అభిషేక్‌ మహంతి ఎస్పీ ర్యాంక్‌లో కొనసాగుతున్నారు.

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. జగన్‌ సహా మరో 8మంది వైకాపా నేతలపై కేసు నమోదు! 

కాగా ఈ ముగ్గురికి కేవలం 24 గంటల సమయం మాత్రమే ఇచ్చిన కేంద్ర హోం శాఖ వెంటనే ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్‌ చేయాలని ఆదేశాలిచ్చింది. అయితే ఈ ఆదేశాలపై ఐపీఎస్‌లు కొంత సమయం కావాలని కోరే అవకాశం ఉంది. మూడు నెలల క్రితం ముగ్గురు ఐఏఎస్‌ అధికారులను ఇలాగే బదిలీ చేసింది కేంద్ర ప్రభుత్వం. తాజాగా ఈ ముగ్గురు ఐపీఎస్‌లకు షాక్‌ ఇచ్చింది. తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి వీళ్లు ఇక్కడే ఉన్నారు. రాష్ట్ర విభజన జరిగిన సమయంలో ఈ ముగ్గురిని కూడా కేంద్రం ఏపీకి అలాట్‌ చేసింది. కానీ, ఆ నిర్ణయాన్ని వీరు ముగ్గురు సవాల్‌ చేస్తూ క్యాట్‌ని ఆశ్రయించారు. అక్కడ వీరి అలాట్‌మెంట్‌కు సంబంధించిన వాదనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

రూల్స్.. రూల్స్.. అంటాడు ఈయన పాటించడా.. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన.!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో సంస్థలు...వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Andhrapradesh #Hyderabad #telangana #ips